స్టాన్లీ క్యుబిక్  దర్శకత్వమ్ వహించిన సినిమా" ది షైనింగ్" . ఇది 1980 లో విడుదల అయింది. ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రాబోతుంది.  అల్రెడీ సినిమా పేరును ప్రకటించేసారు.  దర్శకుడు మైక్ ఫ్లాగనన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని ఒక బుక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.  స్టీఫెన్ కింగ్ రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని " డాక్టర్ స్లీప్" పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

 

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడైన "స్టాన్లి క్యుబ్రిక్" దర్శకత్వం వహించిన చిత్రం" ది షైనింగ్" సినిమాకి ఇది సీక్వెల్. ఈ "డాక్టర్ స్లీపింగ్" సినిమాలో పాత్రదారులుగా ’జాన్ నికోల్సన్’, షెల్లీ దువ్వల్ ’ నటించారు. ఈ సీక్వెల్ కి సంబంధించిన ట్రైలర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. దీనికి విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో  " స్టాన్లీ క్యుబ్రిక్" సినిమాలోని కొన్ని షాట్లను యథాతథంగా తీసుకున్నారట. మిగిలింది మొత్తం మళ్ళీ రీక్రియేట్ చేసిందే అని చెప్పుకొచ్చారు.

 

"హాంటింగ్ ఆఫ్ ది హిల్ హౌస్" అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు "మైక్ ఫ్లాగనన్" ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ కి ఎంత పేరొచ్చిందో అందరికి తెలిసిందే. ఈయన మాట్లాడుతూ, షైనింగ్ సినిమా నుండి పూర్తిగా షాట్స్ ని తీసుకోవడం లేదని,  ఎలివేటర్స్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని డైరెక్టు గా "షైనింగ్ " నుండి తీసుకున్నామని మిగతాదంతా తమ రీక్రియేషనేనని అన్నాడు.

 

ఈ సినిమా కోసం దర్శకుడు  క్యుబిక్ "మైక్ ఫ్లాగనన్ కి " కొన్ని డిజైన్స్ చూపించాడట. అవి తనకి బాగా నచ్చాయని చెప్పాడు.  ఇక సినిమాలో నికోల్సన్ జాక్ టెరాన్స్ అనే పాత్రని చేసాడు. సినిమాలో ఈయన ఒక రచయిత. సడెన్ గా ఒక హోటల్ ని చూసుకోవాల్సి వస్తుంది. " దువ్వల్ అతని భార్యగా నటిస్తుంది. డాని లాయ్డ్ అనే యంగ్ బాయ్ వీరి కొడుకుగా కనిపిస్తాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: