సాధారణంగా దర్శకులకు టాప్ హీరోలు కండిషన్స్ పెడతారు. అయితే ఈసారి దర్శకుడు కొరటాల శివ ఏకంగా మెగా స్టార్ చిరంజీవికి కండిషన్స్ పెట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ‘భరత్ అనే నేను’ మూవీ సూపర్ సక్సస్ తరువాత సుమారు సంవత్సరం పైగా కొరటాల చిరంజీవి సినిమా గురించి వెయిట్ చేస్తున్నాడు. 

ఆగష్టులో వచ్చే చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభంకాబోతున్న ఈమూవీ ఒక సామాజిక సమస్యగా మారిన ప్రస్తుత రైతుల దీనస్థితి పై ఈమూవీ కథ ఉంటుందని సమాచారం. అయితే ఈమూవీ షూటింగ్ ప్రారంభం కావాలి అంటే చిరంజీవి శరీరానికి సంబంధించి పెరిగిన బరువు పూర్తిగా తగ్గాలి అని కొరటాల చిరంజీవికి స్పష్టంగా చెప్పినట్లు టాక్. 

ఈమూవీ షూటింగ్ కు ఇక రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థుతులలో చిరంజీవి పూర్తి డైటింగ్ చేస్తూ రోజుకు రెండేసి గంటలు చొప్పున ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ పర్యవేక్షణలో చాల తీవ్రంగా స్రమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవికి ఆగష్టులో వచ్చే పుట్టినరోజుతో 65వ సంవత్సరంలోకి వస్తున్న పరిస్థుతులలో ఇలాంటి భారీ కసరత్తుల విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహాలు ఇచ్చినా చిరంజీవి అనేక జాగ్రత్తలు తీసుకుని తన పెరిగిన బరువును తగ్గించుకుంటూ మొఖంలో గ్లో కనిపించడానికి యోగ కూడ చేస్తున్నట్లు సమాచారం. 

అంతేకాదు కొరటాల ఈమూవీలో చిరంజీవి చేత ఒక్క పాటలో మంచి మాస్ స్టెప్స్ కూడ వేయించబోతున్నట్లు టాక్. దీనికోసం చిరంజీవి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ కూడ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 65 సంవత్సరాలు వచ్చినా తాను మాస్ హీరోని మాత్రమే అని మరొకసారి సంకేతాలు ఇచ్చే విధంగా కొరటాల చెప్పిన ప్రతి విషయాన్ని అనుసరిస్తూ ఈమూవీ కోసం చిరంజీవి పడుతున్న కష్టం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: