తెలుగులో ఒక సినిమా హిట్టయ్యి దానికి సీక్వెల్ చేసే  అవకాశం ఉంటె ఇటీవల కాలంలో వరసగా చేసుకుంటూ వెళ్తున్నారు.  అయితే, అన్ని సినిమాలకు సీక్వెల్ కు పనిచేయవు.  హాలీవుడ్ లో కలిసి  వచ్చినట్టు టాలీవుడ్ కు కలిసి రాదు అన్నది సత్యం.  


అయితే, తెలుగులో రాజుగారిగది సినిమా వచ్చింది.  ఈ  మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  సినిమా హిట్ కొట్టడంతో సీక్వెల్ పై కన్నేసింది.  సీక్వెల్ లో వచ్చిన రాజుగారిగది 2 సినిమా పర్వాలేదనిపించింది.  స్నానం చేసే వీడియో లీక్ కావడంతో యువతి ఆత్మహత్య చేసుకుంటుంది.  


ఆ తరువాత ఏం జరిగింది అన్నది స్టోరీ.  సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇదిలా ఉంటె, ఈ సినిమాకు మరో సీక్వెల్ చేస్తున్నారు.  అదే రాజుగారి గది 3.  ఈ మూవీ ఈరోజు ప్రారంభమైంది.  ఇందులో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.  


గత కొంతకాలంగా తమన్నా సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలు వరసగా చేస్తూ దూసుకుపోతున్నది.  బాలీవుడ్ లో రీసెంట్ గా రెండు సినిమాలు చేసింది. ఈ రెండు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో.. రాజుగారి గదిలో తమన్నాను తీసుకున్నారని సమాచారం.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: