వరుణ్ తేజ్ కెరీర్లో సింగిల్  సింగిల్ గా హిట్ కొట్టిన సినిమా ఫిదా.  అంతకు ముందు సినిమాలు చేసినప్పటికీ... వరుణ్ తేజ్ కు ఖచ్చితమైన హిట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో వరుణ్ సోలోగా హిట్ కొట్టాడు.  


ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు ఎలాంటి మార్కులు పడ్డాయి అంతకంటే  ఒకింత ఎక్కువ మార్కులు సాయి పల్లవికిపడటం విశేషం.  సాయి పల్లవి ఈ సినిమాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  సూపర్ అనే విధంగా చేసింది.  ఈ సినిమాతో సాయి పల్లవికి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.  


దీని తరువాత వరుణ్ తేజ్ తొలిప్రేమ చేశారు.  ఇది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా చేసిన ఎఫ్ 2 సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఈ హీరో వాల్మీకి సినిమా చేస్తున్నాడు.  ఇదిలా ఉంటె, వరుణ్ తేజ్ కు అదృష్టాన్ని తీసుకొచ్చిన సాయి పల్లవి.. నాగచైతన్యకు కూడా అలాంటి అదృష్టాన్ని తెస్తుందా... 


నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్నది.  ఆగష్టు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి... డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చేస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: