‘జనసేన’ అభ్యర్ధిగా నర్సాపురం నుండి పోటీ చేసి ఓటమి చెంది తిరిగి తన బుల్లితెర షో ‘జబర్దస్త్’ వైపు యూటర్న్ తీసుకున్న నాగబాబు ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చి అనేకమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా పవన్ ఓటమి పై తన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించాడు. ప్రస్తుతం తాను కొత్తగా ఒప్పుకుని నటిస్తున్న సినిమాలు ఏమీలేవు అని చెపుతూ ‘జబర్దస్త్’ కార్యక్రమం మాత్రమే తన ప్రేయారిటీ అని అంటున్నాడు.

ఇక చిరంజీవి ‘సైరా’ గురించి మాట్లాడుతూ ఆ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ తాను చూశానని అంటూ ఆమూవీ ‘బాహుబలి’ అంత గొప్ప హిట్ అవుతుందా అన్న విషయం తాను ఇప్పుడు చెప్పలేనని ప్రతి సినిమాను ‘బాహుబలి’ తో పోల్చడం సరికాదు అన్న అభిప్రాయం వెల్లడించాడు. అయితే దేశ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకునే గొప్ప సినిమాగా ‘సైరా’ ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఇక పవన్ కళ్యాణ్ ఓటమి గురించి మాట్లాడుతూ తాను పవన్ ఓడిపోతాడు అని కలలో కూడ అనుకోలేదు అని అంటూ పవన్ ఓటమి కోసం ‘200 కోట్లు’ ఖచ్చితంగా ఖర్చు పెట్టారు అనీ అదేవిధంగా పవన్ ఓటమి కోసం అధికార దుర్వినియోగం జరిగింది అన్న తన అభిప్రాయాన్ని మెగా బ్రదర్ వెల్లడించాడు. అంతేకాదు పవన్ ఓటమి కోసం కేంద్రప్రభుత్వ అధికార్లు యంత్రాంగం పని చేసిందనీ ఇన్ని శక్తులు ఒకటై పోరాడటం వల్ల పవన్ ఓటమి జరిగిందనీ తన అభిప్రాయం అని అంటూ నాగబాబు పవన్ ఓటమి పై మొట్టమొదటిసారి స్పందించాడు. 

ఇదే సందర్భంలో మరొక ప్రశ్నకు సమాధానం ఇస్తూ సినిమాలలో నటించను అని చెపుతున్న పవన్ అభిప్రాయాలు మార్చగలిగే శక్తి తనకు లేదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు పవన్ పోరాడుతున్న ఆశయాల సిద్ధి కోసం అతని వెంట నడవడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడు సిద్ధమే అని అంటూ పవన్ రాజకీయాలలో ఒంటరి వాడుకాడు  అన్న సంకేతాలు ఇస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: