జర్నీ వంటి  ప్రేమకథా చిత్రాలతో యువతను ఆకట్టుకుంటున్న జై ఇప్పుడు సూపర్‌ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘బ్రేకింగ్‌ న్యూస్‌’. భానుశ్రీ, దేవ్‌గిల్, రాహుల్‌దేవ్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

ప్రస్తుతం, ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూపర్‌హీరో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ ‘ఇందులో జీవన్‌ అనే పాత్రలో జై నటించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మధ్యతరగతి యువకుడు అతను. ఒక మధ్యతరగతి వాడు ఎన్ని కష్టాలు పడతాడో జై అంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు.

 

ఇక, ఉద్యోగం, ఇల్లు అని సాగిపోతున్న అతని జీవితంలో కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి. తన కళ్లెదుట జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి.

 

అయితే, ఒకానొక సందర్భంగా జై సూపర్‌ హీరోగా మారతాడు. అతనికి ఊహించని శక్తులు వస్తాయి. చివరకు సమస్యల్లో ఉన్న ఈ భూమిని ఆయన ఎలా కాపాడాడన్నదే చిత్ర కథ. ఈ స్క్రిప్ట్‌ను చాలా మందికి చెప్పాం. ఈ కథను నిర్మించడానికి ఓ ధైర్యం కావాలి. అలా ముందుకొచ్చిన నిర్మాతను ఎప్పటికీ మరిచిపోలేనని’ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: