మెగా అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ డబ్బింగ్ మరియు ఎడిటింగ్ పై దృష్టి పెట్టారు. ఎడిటింగ్ విషయంలో స్వయంగా చిరంజీవి సూచనలు ఇస్తూ ఈ మూవీలో ఎక్కడా ఒక్క అనవసరమైన సీన్ లేకుడా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రారంభమై మంచి ఆఫర్లు వస్తున్నా ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ విషయాని కొచ్చేసరికి సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్. దీనికి కారణం రజనీకాంత్ ‘2.౦’ మూవీ అని అంటున్నారు. రజనీకాంత్ ‘2.0’ మూవీ శాటిలైట్ డిజిటల్ డీల్ సౌత్ లోనే అతి పెద్ద రికార్డు 110 కోట్లకు జరిగిన అమ్మకం. 

ఇప్పుడా రికార్డును అధిగమించాలని కుదరని పక్షంలో కనీసం సమం చేయాలని మెగా కాంపౌండ్ ఆలోచిస్తోంది. ‘సైరా’ లో చిరంజీవితో పాటు అమితాబ్ విజయ్ సేతుపతి నయనతార తమన్నా లాంటి టాప్ స్టార్స్ ఉన్నారు అని చెపుతున్నా శాటిలైట్ హక్కుల విషయంలో ఛానల్స్ మెగా కాంపౌండ్ వాదనను అంగీకరించడం లేదు అని టాక్. 

అంతేకాదు నేషనల్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్ ముందు చిరంజీవి ఇమేజ్ సరిపోదు కదా అంటూ ఇన్ డైరెక్ట్ గా ఛానల్స్ యాజమాన్యాలు మెగా కాంపౌండ్ ను ప్రశ్నిస్తున్నట్లు టాక్. దీనితో ‘సైరా’ శాటిలైట్ డీల్ విషయంలో ఒక అడుగు ముందుకు పడితే మరొక అడుగు వెనక్కు పడుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: