షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న కబీర్ సింగ్ మూవీ రేపు రిలీజ్ కాబోతున్నది.  తెలుగులో అర్జున్ రెడ్డిగా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యింది.  తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను షాహిద్ కపూర్ చేయగా, షాలిని పాండే రోల్ ను కియారా అద్వానీ చేస్తున్నది. 

 

ఈరోజు ఈ మూవీ దుబాయ్ వంటి కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయ్యింది.  అక్కడి నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.  సినిమా సూపర్బ్ గా ఉందని, షాహిద్ కపూర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని అంటున్నారు.  షాహిద్ కపూర్ రోల్ అందరిని వెంటాడేలా ఉంటుందని అన్నారు. 

 

సందీప్ రెడ్డి వంగ సినిమాను మలిచిన తీరు బాగుందని క్రిటిక్స్ చెప్తున్నాయి.  అర్జున్ రెడ్డికి కొన్ని మార్పులు చేసి రీమేక్ చేశారు.  డ్రగ్స్ కు అడిక్ట్ అయిన డాక్టర్ పాత్రలో షాహిద్ నటన అమోఘం.

 

షాహిద్ నటన అవుట్ స్టాండింగ్ గా ఉందని క్రిటిక్స్ చెప్తున్నాయి.  బాలీవుడ్ లో ఈ సినిమా తరువాత ఇలాంటి సినిమాలు మరికొన్ని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఎలాంటి సంచనాలు సృష్టించిందో అలాంటి సంచలనాలు ఈ మూవీ సృష్టిస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: