తెలుగు సినిమాల్లో పాటలకు ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఈ  మధ్య సినిమాల్లో పాటలు తగ్గుతున్నాయి. డాన్సుతో చేసే పాతలు తగ్గి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. పాటల రచయితల్ గురించి చెప్పాలంటే ముందుగా వచ్చే పేరు వేటూరి. వేటూరి గారు ఎన్నో సినిమాలకు పాటలు రాసారు. చనిపోయే వరకు ఆయన పాటలు రాస్తూనే ఉన్నారు. ప్రతిఘటన సినిమాలో ఆయన్ రాసిన "ఈ ధుర్యోధన దుశ్శాసన "పాట కి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు.

 

వేటూరి గారి ప్రేరణతో పాటల రచయితగా ఇండస్ట్రీ కి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వేటూరి గారు మన మధ్య లేరు. ఆయన తర్వాత పాటల రచయితగా అంతగా పేరొచ్చిన రచయిత సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారు. తన మొదటి సినిమా అయిన సిరివెన్నెల నే తన ఇంటి పేరు చేసుకున్నారు. ఆయన రాసిన "విధాత తలుపున "పాట ఇప్పటికీ చాలా మంది వింటుంటారు.


తెలుగు సినిమా పాటకు మరింతగా సాహిత్య పరిమళాలను అద్ది, అనుభూతుల ఆకాశంలో ఎగరేసిన గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారు  తాజా ఇంటర్వ్యూలో   మాట్లాడుతూ .. "తెలుగు సినిమా పాటకి కావ్యరూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి వేటూరిగారేనని చెప్పాలి. ఆత్రేయగారి ప్రయత్నం కూడా వుంది .. కాకపోతే అది కొన్ని కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది.


వేటూరిగారు వస్తూనే ప్రతిపాటలోను ఏదో ఒక అద్భుతత్వాన్ని ఆవిష్కరించేయడం మొదలుపెట్టారు. ఆ పాటలు నన్ను ఆశ్చర్యపరిచేవి .. ఆలోచింపజేసేవి. ఆయన పాటలు విన్న తరువాత, కాకినాడలో వున్న నాకు 'నేను రాయగలను కదా' అనిపించింది. అలా ఆయన నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పట్ల నాకు పరిపూర్ణమైన గౌరవం వుంది .. నా పట్ల ఆయనకి విపరీతమైన వాత్సల్యం ఉండేది" అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: