ఆన‌వాయితీ మార‌లేదు... ఆయ‌న‌కు హిట్ లేదు. వ‌రుస ప్లాపుల‌తో హిట్ అనే మాట‌కు మొహం వాచిపోయి ఉన్న మంచు వారబ్బాయి విష్ణు ‘ఓటర్’ సినిమాతో హిట్ షూటర్‌గా మారతాడనుకుంటే.. మళ్లీ ఫట్ మనిపించాడు. అప్పుడెప్పుడో వ‌చ్చిన దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి హిట్ల త‌ర్వాత అన్ని ప్లాపులే ప్లాపులు. విష్ణు సినిమా అంటేనే ప్రేక్ష‌కుడు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక ఆయ‌న తాజా చిత్రం ఓట‌ర్‌. కొన్ని నెల‌లుగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఓట‌రు సినిమాను అటు హీరో, ఇటు ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తే చివ‌ర‌కు నిర్మాత అష్ట‌క‌ష్టాలు ప‌డి థియేట‌ర్ల‌లోకి తెచ్చారు.


శుక్ర‌వారం రిలీజ్ అయిన ఓట‌రు క‌థ చూస్తే అమెరికా నుంచి వ‌చ్చిన విష్ణు సుర‌భితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కండీష‌న్ పెడుతుంది. అప్పుడు విష్ణు పోసానిని ఎమ్మెల్యేని చేస్తాడు. ఆ టైంలో ముందుగా ఇచ్చిన హామీ ప్ర‌కారం ఇళ్ల స్థలాలను ఇవ్వడం కుదరదని.. అది మంత్రి భాను శంకర్ కబ్జాలో ఉండటం వల్ల అది తన వల్ల కాదని చెబుతాడు పోసాని. అప్పుడు సంప‌త్‌రాజ్‌కు, విష్ణుకు మ‌ధ్య జ‌రిగిన యుద్ధం, విష్ణు ప్రేమ గెల‌వ‌డం ఇదే ఓట‌ర్ స్టోరీ.


మంచి సోష‌ల్ మేసేజ్ ఉన్నా లాజిక్ లేని స‌న్నివేశాల‌తో ద‌ర్శ‌కుడు మ్యాజిక్ చేయ‌లేదు. విష్ణు, సురభి మధ్య లవ్ సీన్స్‌కూడా పెద్దగా లేకపోవడంతో కెమిస్ట్రీ వర్కౌట్ చేసే ఆస్కారం కనిపించలేదు. సినిమాలో భారీ డైలాగులు ఉన్నాయి. ఫ‌స్టాఫ్‌లో లెక్క‌లేన‌న్ని రొటీన్ సీన్లు ఉంటాయి. ఇండియానే గ్రేట్ కంట్రీ కాద‌ని హీరో డైలాగులు, హీరోయిన్‌ను రేప్ చేస్తుంటే క్ష‌ణాల్లో హీరో వాలి విల‌న్ల‌ను చిత‌క్కొట్టేయ‌డం లాంటి రొడ్డ‌కొట్టుడు సీన్ల‌కు లెక్కేలేదు.


ఉన్నంత‌లో బెట‌ర్ ఏంటంటే మంచి స్టోరీ లైన్‌, నిర్మాణ విలువ‌లు, గ‌త సినిమాల‌తో పోలిస్తే విష్ణు లుక్ బెట‌ర్ అవ్వ‌డ‌మే ఓట‌ర్లో బెట‌ర్ పాయింట్స్‌. ఫైన‌ల్‌గా మేట‌ర్‌లేని ఓట‌ర్ అయిన ఈ సినిమాతో విష్ణు గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: