పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. రాజ్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చింతకింది మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి చెప్పిన విశేషాలు....

 

కెరీర్ ప్రారంభంలో ‘పెళ్లి చూపులు’ చిత్రం కమేడియన్‌గా నాకు మంచి బ్రేక్ ఇస్తే ‘ఘాజీ’ నాలో మరో యాంగిల్ ఉందని తెలియజేసింది. నటుడిగా మరింత ముందుకు వెళ్ళడానికి ఆ రెండు సినిమాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. వైఫ్ ఆఫ్ రామ్, కణం సినిమాలు నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. ప్రియదర్శి కమేడియన్ గానే కాదు మిగతా క్యారెక్టర్స్ కూడా చేయగలడు అనే నమ్మకం కలిగించాయి.

 

ఆ సినిమాల తర్వాత నాకు మరిన్ని మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇక ముందు కూడా అన్ని క్యారెక్టర్స్ చేయాలనుంది. ‘మల్లేశం’ సినిమాకు రచయితగా పనిచేసిన అజయ్ వేగేశ్న ‘అ’ సినిమా చేస్తున్నప్పుడు నన్ను మల్లేశం బయోపిక్‌కి హీరోగా అనుకుంటున్నారని చెప్పారు. ఆయన చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇది నిజమేనా అనిపించింది.

 

ఈ సినిమా ప్రారంభానికి ముందు మల్లేశంను కలవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తిని కలుస్తున్నాను… అనే టెన్షన్‌తోనే ఆయనని కలిశాను. కానీ ఆయన చాలా సింపుల్‌గా కనిపిస్తూ నన్ను ఆహ్వానించారు. కలిసిన వెంటనే ఆయన్ని కౌగిలించుకున్నాను. ఆ తర్వాత ఆయన మాకెన్నో విషయాలు చెప్పారు. ఆయన దాంపత్య జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఆయన చెప్పిన విధంగా సినిమా తీయలేకపోయాము.


మరింత సమాచారం తెలుసుకోండి: