ఆయన సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులకు అదో పండగ. ఆయన వెండితెరపై కనిపిస్తే అభిమానుల్లో అంతులేని ఉత్సాహం. ఆయన డ్యాన్స్‌కు చిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేదు అందరూ ఫిదా కావాల్సిందే. తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి.

 

చదువు పూర్తయిన తర్వాత శివ శంకర్‌ వరప్రసాద్‌ మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడి నుంచి వరుస అవకాశాల కోసం సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగడం ప్రారంభించారు. ఇదే సమయంలో చిరు, నటుడు సుధాకర్‌, హరిప్రసాద్‌లు కలిసి ఒకే రూమ్‌లో ఉండి తమ ప్రయత్నాలు కొనసాగించారు.

 

'పునాదిరాళ్ళు’ చిత్రంతోనే శివ శంకర్‌ వరప్రసాద్‌ చిరంజీవిగా మారారు. ఈ సందర్భంగా పలు పేర్లను సైతం పరిశీలించారు. శంకర్‌, శంకర్‌బాబు అని.. అయితే చిరంజీవి పేరు పెట్టడం దైవికంగా జరిగిందని చెబుతుంటారు చిరు. ‘‘ఒకరోజు కలలో నేను రాములవారి ఆలయంలో నమస్కారం చేసుకుంటున్నాను. అప్పుడు వెనుక నుంచి ఎవరో ‘చిరంజీవి’ రా వెళ్దాం అని పిలిచారు.

 

వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. ఆంజనేయస్వామికి మరో పేరు చిరంజీవి. ‘ఈ పేరునే నువ్వు సినిమాల కోసం పెట్టుకోవచ్చు కదా! ’ అని అమ్మ సూచించడంతో చిరంజీవి పేరు సినిమాల కోసం పెట్టుకున్నా’’ అని ఓ సందర్భంలో చెప్పారు చిరు. ఆరోజు సరిగ్గా ఇదేరోజు అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: