అల్లు అరవింద్ కు అందరూ అల్లు అర్జున్, అల్లు శిరీష్  ఇద్దరే కుమారులని అనుకుంటారు. కానీ ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్  గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రొడక్షన్ సైడ్ ఉండి తన తండ్రికి సహాయ, సాకారాల్ని అందించే వెంకటేష్ ,  పరిశ్రమ వారందరికి తెలుసు. సినీ ఫ్యామిలీ కి చెందిన వెంకటేష్ ను అంత  ముద్దుగా అల్లు బాబీ అని పిలుస్తుంటారు .  సినిమా పరిశ్రమ వారికే పరిచయమున్న అల్లు బాబీ ఇప్పుడు , రెండవ పెళ్లి చేసుకున్నాడు .


ఇదివరకే ఒక  పెళ్లి చేసుకున్న అల్లు బాబీ, మొదటి భార్య తో విడిపోయాక, ప్రస్తుతం  రెండవ పెళ్లి చేసుకున్నాడు. బాబీ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు నిలు షా . ఎంబీఏ పూర్తి చేసిన తాను, ప్రస్తుతం హైదరాబాద్ లో సోదరి తో కలిసి యోగ సెంటర్ నడుపుతుంది.  ఈ  పెళ్ళిలో అల్లు ఫ్యామిలీ మొత్తం కనిపించినప్పటికీ , అల్లు అర్జున్ మాత్రం ఎవరికి  కనిపించకపోవడం హాట్ టాఫిక్ గా మారింది.


 బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా లో బిజీగా ఉండడం వల్లే అన్న పెళ్ళికి హాజరుకాలేక పోయాడని అంటున్నారు. ఇన్నాళ్లూ బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని అల్లు బాబీ, రెండవ పెళ్లి తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అల్లు బాబీ, నిలు షా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: