రాజకీయాల్లో సాధారణంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటాం. పదవులు దక్కించుకోవడానికి ఎదుటి యారిపై ఎటువంటి కామెంట్స్ చేయడానికైనా వెనుకాడరు. ఎంత నీచానికైనా దిగుతారు. విద్వేషాలు రెచ్చగొడతారు. ఇలాంటి సంస్కృతి సినిమా రంగానికి కూడా అంటుకుంది.తాజాగా నడిగర్ సంఘం (తమిళ సినీ నటుల సంఘం)ఎన్నికలు నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి.

 

ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు.... భాగ్యరాజా నేతృత్వంలోని టీం బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగ్యరాజా టీంకు మద్దతు ఇస్తున్న తమిళ దర్శకుడు భారతీ రాజా విశాల్ మీద సంచలన ఆరోపణలు చేసారు. నడిగర్ సంఘం తమిళులు కాని వ్యక్తుల చేతుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా బాధగా ఉందని, భాగ్యరాజా నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.

 

తాము గెళిస్తే నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటుల సంఘం) పేరు... తమిళ సినీ నటు సంఘంగా మారుస్తామని... ఇప్పుడు తెలుగు, మలయాళం పరిశ్రమలకు సపరేటుగా సంఘాలు ఉన్నాయి. పాత కాలం నాటి ఈ పేరు ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని, భాగ్యరాజా టీం గెలిస్తే దీన్ని తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తామని ప్రచారం చేస్తున్నారు.

 

తమిళ సినీ నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాల్ పందికొక్కులా మారాడని, నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, విశాల్ లాంటి పందికొక్కుతో పాటు అందులోని చీడపురుగులను నిర్మాతల మండలి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.విశాల్ టీం కూడా ఇదే స్థాయిలో ప్రత్యారోపణలు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: