బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్.  ఆ సినిమాతో పాపులరిటీ బాగా పెరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి  జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ "సాహో" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుండి అంచనాలు  భారీగా  ఉన్నాయి.బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది.

 

మొన్న రిలీజైన "సాహో" టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ టీజర్ అందరికీ విపరీతంగా నచ్చింది. బాలీవుడ్ మొత్తం టీజర్ బాగుందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక్కరు మాత్రం కొంత విభిన్నంగా స్పందించారు. ఎప్పుడు ఎవరో ఒకరి మీద విమర్శలు చేసే బాలీవుడ్ కమెడియన్ కమల్ ఆర్ ఖాన్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ స్పందించాడు.

 

హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో కమల్ సాహో చిత్రంపై నెగిటివ్ గా స్పందించాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. అతిపెద్ద డిజాస్టర్స్ లో సాహో ఒకటిగా నిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. తాజాగా కమల్ ఆర్ ఖాన్ సాహో చిత్రంపై యూటర్న్ తీసుకున్నాడు. ప్రభాస్ ని ప్రశంసలతో ముంచెత్తడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 సాహో చిత్రం ఘనవిజయం సాధిస్తుంది. ప్రభాస్ బాలీవుడ్ లో కూడా తిరుగులేని స్టార్ గా అవతరిస్తాడు. సౌత్ నుంచి ఓ హీరో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదగడం అభినందించదగ్గ విషయం అని కమల్ ప్రశంసించాడు. సా టీజర్ అద్భుతంగా ఉండడంతోనే కమల్ తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.  ఆగష్టు 15న సాహో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రభాస్ కి జోడీగా శ్రద్ధ కపూర్ నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: