వెండితెర మన్మధుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇనేజ్ ని క్రియేట్ చేసుకున్న నాగార్జున బుల్లితెర పై కూడ తాను రాణించగలను అంటూ ‘మీలోఎవరు కోటీశ్వరుడు’ షోతో నిరూపించుకున్నాడు. ఆ షో ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు నాగ్ త్వరలో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్ 3’ రెడీ అవుతున్నాడు. 

అయితే ఇక్కడ నాగ్ ఈకార్యక్రమానికి హోస్ట్ గా రాణించగలడా అంటూ కొందరు వ్యక్తపరుస్తున్న సందేహాలు అత్యంత ఆశ్చర్యకరంగా మారాయి. ఇలా కామెంట్స్ రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది ఇప్పటి వరకు ప్రసారం అయిన ‘బిగ్ బాస్’ షో కార్యక్రమాలలో జూనియర్ హోస్ట్ చేసిన సిరీస్ కు విపరీతమైన రేటింగ్స్ వచ్చాయి. ఆతరువాత ఆ కార్యక్రమాన్ని రెండవ సీజన్ హోస్ట్ చేసిన నాని ఎంత కష్టపడినా జూనియర్ ‘బిగ్ బాస్’ షోతో పోలుస్తూ నాని ప్రయత్నాలపై పెదవి విరిచారు.

ఇప్పుడు ఇదే సమస్య నాగార్జునకు ఎదురౌతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. వాస్తవానికి ‘బిగ్ బాస్’ షోలో సంచలనాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు వివాదాలు చాల ఎక్కువగా ఉంటాయి. వీటి పై స్పందిస్తూ హౌస్ మేట్స్ ను తన చెప్పుచేతలలో  తన ఆదిపత్యం కొనసాగిస్తూ వారందర్నీ కంట్రోల్ చేయాలి అంటే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే వ్యక్తికి విపరీతమైన ఎనర్జీతో పాటు గంభీరమైన ముఖ కవళికలతో పాటు ఎనర్జిటిక్ వాయస్ ఉండాలి. 

అయితే ప్రస్తుతం నాగార్జున ఆరు పదుల వయసుకు దగ్గర అవుతున్న నేపధ్యంలో ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా రాణించి మెప్పించగలడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘మీలోఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం నాలెడ్జికి సంబంధించింది అయితే ‘బిగ్ బాస్’ ఎంటర్ టైన్మెంట్ ముసుగులో అడల్ట్ కంటెంట్ ఉన్న కార్యక్రమం. దీనితో ఇలాంటి షోలను ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ బాగా చూస్తారు. ఇలాంటి పరిస్థుతులలో మాస్ క్లాస్ ఆడియన్స్ ను ఎలా ఎంటర్ టైన్ చేస్తాడో ఈ మన్మధుడు చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: