పెళ్ళి చూపులు సినిమాతో ఫేమ్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అర్జున్ రెడ్డి విజయం తర్వాత యూత్ లో క్రేజ్ బాగా పెరిగింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన "గీత గోవిందం" సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.

 

ఆ తర్వాత వచ్చిన్ టాక్సీవాలా సరిగ్గా ఆడకపోయినప్పటికీ విజయ్ కి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ తర్వాతి చిత్రం " డియర్ కామ్రేడ్" షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ సినిమాలోని ఒక పాట కోసం మళయాలం నటుడు తన గాత్రాన్ని అందించబోతున్నాడు.

 

మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ..డియర్ కామ్రేడ్ కోసం ఓ పాట పాడారు. అయితే తెలుగు వెర్షన్ కోసం కాదు ..మలయాళంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాట పాడాడు. నటనతో పాటు మంచి గాత్రం ఉన్న దుల్కర్ అక్కడ బాగానే పాటలు పడతాడు. అందుకే ఆయనతో ఓ సాంగ్ పాడించి సినిమాకు అదనపు ఆకర్షణ తెప్పించారు.

 

దుల్కర్ సల్మాన్ గతంలో ఎబిసిడి-సిఐఎ-చార్లీ లాంటి సినిమాలకు పాడాడు. మ్యూజికల్ గా అవి హిట్టయ్యాయి కూడా. ఇప్పుడూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కామ్రేడ్ టీం నమ్మకం. మైత్రి మూవీ బ్యానర్ లో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: