సాధనంగా పెళ్లి ఖర్చు ఎంత అవుతుంది.  మామూలు ఇంట్లో అయితే 5 నుంచి 10 లక్షలు ఉంటుంది.  సెలెబ్రిటీల పెళ్లిళ్లు అయితే 5 నుంచి 10 కోట్లు ఖర్చు చేస్తారు.  జయలలిత దత్త పుత్రుడి కొడుకు వివాహానికి 100 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.  ఈ స్థాయిలో ఖర్చు చేయడం మామూలు జనాలకు సాధ్యం కాదు. 

 

అయితే, డెహ్రాడూన్ లోని ఔలి ప్రాంతానికి చెందిన ఓ సంపన్నుల ఇంట్లో పెళ్లి జరిగింది.  ఈ వివాహానికి ఆ కుటుంబం పెట్టిన ఖర్చు 200 కోట్లు.  200 కోట్ల రూపాయల పెట్టి పెళ్లి అంటే మాములు విషయం కాదు.  దాదాపు ప్రభాస్ సాహో సినిమా బడ్జెట్.  ఈ ఖర్చుతో నాలుగైదు సినిమాలు తీయ్యోచు. 

 

ఈ పెళ్ళిలో స్పెషల్ డ్యాన్స్ చేయాలని బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను ఆహ్వానించారట.  మొదట కత్రినా అందుకు ఒప్పుకోలేదు.  రెమ్యునరేషన్ భారీగా ఇస్తామంటే కాదంటుందా చెప్పండి.  ఖచ్చితంగా ఒప్పుకుంటుంది.  అనుకున్నట్టుగానే ఈ అమ్మడుకి భారీగా ముట్టజెప్పారు. 

 

అంతేకాదు.. పెళ్లికి వచ్చేందుకు ఆమెకు ముంబై నుంచి ఆమెకు స్పెషల్ హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు.  స్పెషల్ హెలీకాఫ్టర్లో పెళ్ళికి వెళ్లి అక్కడ డ్యాన్స్ చేసి తిరిగి వచ్చింది.  షీలాకీ జవానీ సాంగ్ కు కత్రీనా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది.  కత్రినాతో పాటు మరికొంతమంది టీవీ, సినిమా స్టార్స్ కూడా ఈ వివాహ వేడుకలో సందడి చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: