సైరా సినిమా మొదలయ్యి రెండేళ్లు దాటింది.  పర్ఫెక్షన్ పేరుతో సినిమాను చెక్కుతున్నారు.  ప్రతి సీన్ ను జాగ్రత్తగా కవర్ చేస్తున్నారు.  ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నారు.  ఇంతవరకు బాగానే ఉన్నది.  ఇప్పుడు మెగాస్టార్ పై అదనపు భారం పడబోతున్నది. 

 

సైరా సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.  శెరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.  మెగాస్టార్ డబ్బింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.  చిరు డబ్బింగ్ పూర్తి చేసి.. మిగతా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పై దృష్టిపెట్టబోతున్నారు.  రామ్ చరణ్ త్వరలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. 

 

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన వెంటనే..  మహారాష్ట్ర, అహ్మదాబాద్ లో జరిగే లాంగ్ షెడ్యూల్లో ఈ స్టార్స్ పాల్గొనబోతున్నారు.  దాదాపు మూడు నెలలపాటు ఈ షెడ్యూల్ ఉంటుంది.  ఈ ఇద్దరు స్టార్స్ అందుబాటులో ఉండాలని రాజమౌళి ఇప్పటికే హుకుం జారీ చేశారు.  దీంతో సైరా బాధ్యతలను పూర్తిగా తండ్రిపై ఉంచి నిర్మాత చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నట్టు వినికిడి.  నిర్మాత బాబాయి నాగబాబుకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. 

 

ఇప్పటికే సైరా బిజినెస్ కూడా పూర్తయింది.  చిరు పుట్టినరోజుకు చరణ్ అందుబాటులో ఉంటాడట.  ఏవైనా ప్రీ రిలీజ్ బిజినెస్ పనులు ఉంటె అప్పటి పూర్తి చేస్తారని సమాచారం. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న మెగాస్టార్ కు ఈ సినిమా ఒక ఛాలెంజ్ గా నిలవబోతున్నది.  అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: