అమలాపాల్ ఆమె ట్రైలర్ లో నగ్నంగా కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది. ఏ హీరోయిన్ ఇలా నగ్నంగా కనిపించడానికి ఇంత సాహసానికి పూనుకోలేదు. ఇటీవల విడుదలైన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన అమలా పాల్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కథలోని తీవ్రత, ఇంటెన్సిటీ ప్రేక్షకులకు అర్థమవ్వాలనే ఈ న్యూడ్ సీన్ టీజర్లో ఫోకస్ చేశారు. 


ఈ న్యూడ్ సీన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తవ్వడానికి మొత్తం 20 రోజుల సమయం తీసుకున్నారట. తమిళ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కూడా ఏకంగా 20 రోజుల పాటు వరుసపెట్టి న్యూడ్ సీన్లో నటించలేదని, అమలా పాల్ మాత్రమే ఇలాంటి సాహసం చేసిందని అంటున్నారు. అమలా పాల్ నటించిన ఈ సీన్ గ్లామర్ షో ఏ మాత్రం కాదని, కథలో భాగంగా వచ్చే ఒక దారుణ సంఘటన నేపథ్యంలో ఈ సీన్ వస్తుందని అంటున్నారు.


కథ కోసం ఇలాంటి సీన్ చేయడానికి ముందుకు వచ్చిన అమలా పాల్‌ను సినీ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ ఏమేరకు ఉంది? స్వేచ్ఛ లభించిన వారు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా సమాజంలో మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే అంశం ప్రధానంగా చర్చిస్తూ ఈ మూవీ సాగుతుందటసి. 

మరింత సమాచారం తెలుసుకోండి: