నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. చాలా మంది ఇదొక పొలిటికల్ డ్రామా అని.. ప్రస్తుత రాజకీయాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ఈ చిత్రంలో జగపతి బాబు రోల్.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను పోలి ఉంటుందని చెబుతున్నారు.

 

అయితే ఈ రూమర్‌ని నిర్మాత సి. కల్యాణ్ కొట్టిపారేస్తున్నారు. ఇదొక పూర్తి కమర్షియల్ చిత్రమని, ఈ చిత్రంలో బాలయ్య ఒక పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నారని, ఇది ఏ వ్యక్తితో ముడిపడదని, ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం కాదని సి.కల్యాణ్ స్పష్టం చేశారు.

 

ఈ చిత్రంలో బాలయ్య విభిన్నమైన టు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారట. ఒకటి పోలీసాఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర. ఒక నిజాయితీ, సిన్సియర్ పోలీసాఫీసర్.. గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులేంటనేదే ఈ కథ సారాంశమట.

 

మొత్తానికి మన బాలయ్య 'సింహా' లాంటి తరహా కథను ఎంచుకున్నారన్నమాట!  ఆలా అయితే ఇది బాలయ్య అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు! జై బాలయ్య... జై జై బాలయ్య....


మరింత సమాచారం తెలుసుకోండి: