సినిమా రంగంలో మంచి మాస్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని... రాజకీయాల్లో అంతే స్థాయిలో గుర్తింపు సాధించాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయింది. సినిమా రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇందుకు టాలీవుడ్ లో ఎంతో పెద్ద హీరోలుగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎలా ప్లాప్‌ అయ్యారు మనం చూశాం.


ఇక తెలుగు, తమిళ రాజకీయాల్లో సినిమాలకు... రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు భాషల్లో సినిమాల్లో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా అంతే స్టార్లుగా వెలుగొందారు. ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్ ఇందుకు నిదర్శనం.ఆ తర్వాత వీరి బాట‌లో చాలా మంది సినిమా స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ప్రజామోదం పొందలేకపోయారు. ఒకప్పుడు స్టార్ హీరో గా ఓ వెలుగు వెలిగిన విజయ్ కాంత్ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాలు అన్ని కలలుగానే మిగిలిపోయాయి. 


ఒకప్పుడు విజయ్ కాంత్ డీఎండీకే పార్టీకి ఆయన సొంత ప్రాంతంలో మంచి పట్టు ఉండేది.. ఆ పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు గెలిచారు. చివరకు ఆయన ఒక్కడే గెలిచారు. ఆ తర్వాత విజయకాంత్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఇప్పుడు పార్టీని నడపలేక పోవడంతో పాటు... రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు మొత్తం పోగుట్టుకొని అప్పులపాల‌య్యి ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట.


తాను పార్టీ న‌డిపేందుకు గ‌తంలో ఓ కార్పొరేట్ బ్యాంకు ద‌గ్గ‌ర కోట్లాది రూపాయ‌ల అప్పు తీసుకున్న తీర్చలేద‌ట‌. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకు విజ‌య్ ఇంటితో పాటు అత‌డి ఆస్తుల‌ను జ‌ప్తు చేసే ప్ర‌క్రియ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ విష‌యం త‌మిళ‌నాట ఆస‌క్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: