క‌మ‌ల్‌హాస‌న్ గారాల త‌న‌య‌, స్టార్ హీరోయిన్ శ్రుతిహాస‌న్ సినిమాల‌కు బ్రేక్ తీసుకుని ప్రేమ‌లో మునిగిపోయారు. అయితే ల‌వ్ బ్రేక‌ప్‌తో మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు. త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు.

 

అలాగే తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి పేరే బ‌లంగా విన‌ప‌డుతుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం శ్రుతి హాస‌న్ అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ `టెడ్‌స్టోన్‌`లో న‌టించ‌నున్నార‌ట‌.

 

ఈ వెబ్‌సిరీస్‌ను అమెరికా, ఇండియాలో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. వెయిట్రెస్‌గా క‌న‌ప‌డుతూ ర‌హ‌స్యంగా హ‌త్య‌లు చేసే పాత్ర‌లో శ్రుతిహాస‌న్ క‌నిపించ‌నున్నారు. రామిన్ బహ్రనీ ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇది ఓ ర‌కంగా శ్రుతిహాస‌న్‌కు మంచి అవ‌కాశంగానే భావించాలి.

 

ఎందుకంటే ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్‌లో గుర్తింపు సంపాదించుకుంటే.. హాలీవుడ్ సినిమాల్లో అవ‌కాశాలు రావ‌చ్చు. మ‌రి ఈ వెబ్‌సిరీస్ శ్రుతిహాస‌న్‌కు ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో వేచి చూద్దాం. బేసిగ్గా అక్కడి వాతావరణం అమ్మడుకి అలవాటు కనుక బాగానే సెట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: