మనిషికి ఆశ ఉండొచ్చు.. కానీ అత్యాశ పనికిరాదు అన్న నానుడి ఉంది. ఇది సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతూ బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ బొక్క బొర్లా పడిన‌ హీరోయిన్లకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. కళ్ల ముందు ఉన్న క్రేజ్‌ను కాదనుకొని ఇక్కడ భారీ ఆఫర్లు వదులుకొని బాలీవుడ్ లో ఏదో వస్తుంది అని చటుక్కున వెళ్లిపోతారు. అక్కడ రెండు ప్లాపులు తగిలిన వెంటనే తిరిగి ఇక్కడకు వస్తారు. అయితే అప్పటికే ఇక్కడ వాళ్లపై ప్రేక్షకులకు మొహం మొత్తేసి ఉంటుంది.


ఇలా కెరీర్ నాశనం చేసుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇలియానా, తమన్నా, ఆశిన్, శ్రేయ, జెనీలియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తెలుగు తమిళ్ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ బాలీవుడ్‌లో ఏదో వెల‌గ పెట్టాలని వెళ్లి చేతులు కాల్చుకుని కెరీర్ నాశనం చేసుకున్న వారే. ఇప్పుడు పూజ హెగ్డే కూడా వీరి బాటలోనే పయనిస్తోంది. తెలుగులో ఇప్పుడు ఆమెకు స్టార్ హీరోల సరసన వరుసపెట్టి ఛాన్సుల మీద ఛాన్సులు వస్తున్నాయి. స్టార్ హీరోలు అయితే ఆమెకు వరుసగా రెండు ఛాన్సులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. 


ఈ టైంలో ఆమె బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చింది. అక్కడకు వెళ్లిపోవాల‌ని ఆ సినిమాకు ఓకే చెప్పే ప‌నిలో ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఓ బి-గ్రేడ్ సినిమా. గతంలో ఇక్కడ టాప్ సినిమాల్లో నటించిన హీరోయిన్లు సైతం హిందీలో అవకాశం అంటూ ఆశపడి బి-గ్రేడ్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్నారు. ఇప్పుడు పూజ కూడా వీరి బాటలోనే వెళుతోందా ? అన్న సందేహం రాక మానదు. బాలీవుడ్ హీరోయిన్‌గా రాణించాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. జాతీయ స్థాయిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు పెరిగిపోవచ్చు. 


అయితే ఒకటి రెండు సినిమాల ఛాన్స్‌ల‌కు ఆశపడి స్టార్ హీరోయిన్ స్టేటస్ వదులుకొని ఓకే చెప్పేస్తే అనవసరంగా కెరీర్ నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఇలా రెండు చోట్ల రాణించిన వారిలో  శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌, విద్యాబాల‌న్ లాంటి కొంత మంది హీరోయిన్‌లు మాత్ర‌మే ఉన్నారు. మిగిలిన వారంతా ఇక్క‌డ నుంచి అక్క‌డ కాలు పెట్టి చేతులు కాల్చుకున్న‌వారే.


మరింత సమాచారం తెలుసుకోండి: