మంచు విష్ణు సినిమా ‘ఓటర్’కు షాక్ తగిలింది. అస‌లు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకే అష్ట‌క‌ష్టాలు ప‌డ్డ ఓట‌ర్ సినిమా ఎట్ట‌కేల‌కు నిర్మాత పంతంతో రిలీజ్ అయ్యింది. తొలి ఆట నుంచే ఓట‌ర్‌కు అట్ట‌ర్ ప్లాప్ టాక్ వ‌చ్చింది. ఐదారేళ్లుగా హిట్లు లేకుండా డీలా ప‌డిన విష్ణు ఖాతాలో మ‌రో ప్లాప్ ప‌డిపోయింది. సినిమా ప్లాప్ అవ్వ‌డం ఒక ఘోరం అయితే క‌నీసం తొలి రోజే కొన్ని చోట్ల ప్రేక్ష‌కులు లేక‌పోవ‌డంతో షోలు క్యాన్సిల్ అవ్వ‌డం మ‌రీ ఘోరం.


తొలిరోజే థియేటర్ లో పది మంది ప్రేక్షకులు కూడా లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. కొన్ని సీ సెంట‌ర్ల‌లో అయితే తొలి షోలే క్యాన్సిల్ అయ్యాయ‌ట‌. ట్విస్ట్ ఏంటంటే హీరో ఎవరో తెలియని ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాకి ఉన్న బజ్ కూడా ఓటర్ సినిమాకి లేదు. ఇక చిన్న సినిమాల‌కు కూడా రివ్యూలు ఇచ్చే వెబ్‌సైట్లు ఓట‌రు సినిమాను ప‌ట్టించుకోలేదు... ఒక‌రిద్ద‌రు మిన‌హా దీనికి రివ్యూలు కూడా ఇవ్వలేదు.


ఫైన‌ల్‌గా ఓట‌రుకు పబ్లిసిటీ పైసలు వస్తేనే ఎక్కువని అంటున్నారు. గ‌తంలో విష్ణు త‌మ్ముడ మంచు మ‌నోజ్ న‌టించి శౌర్య సినిమాకు కూడా ఓవ‌ర్సీస్‌లో ప్రేక్ష‌కులు లేక‌పోవ‌డంతో షోలు క్యాన్సిల్ చేశారు. అక్క‌డ శౌర్య ప్రీమియ‌ర్లు వేస్తే కొన్ని థియేట‌ర్ల‌లో ఒకే ఒక్క ప్రేక్ష‌కుడు ఉండ‌డంతో ఆ షోలు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు త‌మ్ముడు రికార్డును అన్న బ్రేక్ చేసేశాడు.


మ‌నోజ్ సినిమాకు ఓవ‌ర్సీస్లో ప్రేక్ష‌కులు లేరేమో గాని.. విష్ణు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ఆట‌కే ప్రేక్ష‌కులు లేని ప‌రిస్థితి. ఇంత ఘోర‌మైన సినిమాలు మంచు సోద‌రులు ఎలా ?  చేస్తున్నారో ?  వారికే తెలియాల‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: