ప్రియదర్శి మల్లేశం సినిమా గురించి ప్రస్తావిస్తూ, ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాక ఇమేజ్ గురించి అసలు ఆలోచించలేదు. నా దృష్టిలో ఒక నటుడికి ఇమేజ్ అనేది శాపం లాంటిది. ఇండస్ట్రీలో ఒక పాత్రలో సక్సెస్ అయితే చుట్టూ ఓ ఇమేజ్ ఏర్పాటవుతుంది. దీనికి నేను ఎప్పుడూ భిన్నంగా వెళ్లాలనే ఆలోచించాను.

 

నటీనటుల్ని ఒకే చట్రానికి పరిమితం చేయడం అన్నది నాకు నచ్చదు. ఇండస్ట్రీలో చాలా మంచి నటులున్నారు. అందరిని కొత్త కోణంలోనే చూడాలనుకుంటాను. అలాగే నన్ను కూడా. పెళ్లి చూపులు రిలీజైన తరువాత ఘాజీ విడుదలైంది.

 

ఆ సినిమాలో నేను సీరియస్ పాత్రలో కనిపించినా థియేటర్లలో తెరపై నన్ను చూసిన ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడే నిర్ణయించుకున్నాను. నా పాత చిత్రాల్ని మర్చిపోయే స్థాయిలో నేను ఏదైనా చేయాలని మల్లేశంని సవాల్‌గా తీసుకున్నాను.

 

శారాజీ పేట అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టి మధ్య తరగతి ఇబ్బందుల్ని ఎదుర్కొని మగ్గం నేసే చేనేత కళాకారుడిగా పేరు తెచ్చుకుని అమ్మ బాధ చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టాలన్న తపనే ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇంత కంటే నేను గొప్ప ప్రేమకథను వినలేదు.. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: