పోసాని కృష్ణ మురళి దర్శక , నిర్మాత, మాటల రచయిత కంటే ఎక్కువ  నటుడిగా బిజీ అయ్యాడు . ఏటా ఓ 40 సినిమాల్లో నటిస్తున్న పోసాని కృష్ణ మురళి, రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు .  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను తీవ్రంగా వ్యతిరేకించే పోసాని కృష్ణమురళి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని  అంతగా అభిమానిస్తుంటాడు .   ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున తనదైన శైలి ప్రచారం నిర్వహించిన  పోసాని కృష్ణ మురళి … తాను కోరుకున్నట్లుగానే  జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం తో చాల హ్యాపీ గా ఫీలయ్యాడు.


ఇక రాజకీయాలు చాలు ... సినిమాలు చేసుకుందామని అనుకున్న పోసాని కృష్ణ మురళి కి ఇప్పుడు పెద్దగా సినిమావకాశాలు లభించడం లేదట . ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు . తెలుగు సినిమా పరిశ్రమ లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉన్నారని వారు తనకు  ఆఫర్లు రాకుండా చేస్తున్నారని అంటున్నాడు ఈ రైటర్ కం యాక్టర్ . ఇటీవల తనని ఒక పెద్ద సినిమా నుంచి తప్పించారని , అటువంటి దర్శక, నిర్మాతలు చాలామందే ఉన్నారని చెప్పాడు పోసాని కృష్ణ మురళి . అటువంటి   వాళ్లలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఒకరంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లో  హాట్ టాఫిక్ గా మారాయి .


వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కమెడియన్ పృథ్వీ రాజ్ ను కూడా మెగా హీరోలు బహిష్కరించారన్న వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి . పృథ్వీ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం వల్లే మెగా హీరోలు తమ సినిమాల్లో ఈ కమెడియన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు  అవకాశాలు ఇవ్వొద్దంటూ దర్శక , నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నారట . పృథ్వీ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పకపోయినా , పోసాని కృష్ణ మురళి మాత్రం అసలు విషయాన్ని బయటపెట్టేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: