గతంలో నాగార్జున హీరోగా చేసిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ కొట్టింది.  ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  దీనికి ప్రీక్వెల్ సినిమా చేయాలని అనుకున్నారు.   అప్పట్లో కుదరలేదు.  ఈలోపు నాగార్జున కొన్ని సినిమాలు చేశారు.  


కళ్యాణ్ కృష్ణ కథ ను రెడీ చేశారు.  మొత్తంగా అన్ని పూర్తయ్యాయి.  షూటింగ్ కు వెళ్లడమే మిగిలింది.  ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్యకూడా నటిస్తున్నారు.  నాగచైతన్యకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.  మహానటి సినిమా తరువాత తెలుగులో సినిమా చేయలేదు.  


ప్రస్తుతం ఈ నటి నాగార్జున మన్మధుడు 2 లో నటిస్తోంది.  ఈ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నారు.  ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇక బంగార్రాజు విషయానికి వస్తే.. నాగార్జున, నాగచైతన్యలు ఇద్దరు కలిసి చేస్తున్న పూర్తి సినిమా అని తెలుస్తోంది.  


దీనిని మనం తరహాలో ఫ్యామిలీ మూవీగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.  అప్పట్లో మనం సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  మనం కోసం నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లు నటించారు.  అందులో సమంత హీరోయిన్.  మరి ఈ బంగార్రాజు లో కూడా అఖిల్, సమంతలు ఉంటారా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: