ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమా అంటే కనీసం 200 నుంచి 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.  రజినీకాంత్ 2పాయింట్ 0 సినిమాకు 400 రూపాయల బడ్జెట్ అయ్యింది.  ఇప్పటి వరకు ఇదే భారీ బడ్జెట్ సినిమా.  ఈ స్థాయిలో బడ్జెట్ ఉండే సినిమాలలో నటించే హీరోలకు రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది.. 50 నుంచి 60 కోట్లు అనుకోవచ్చు.  


2పాయింట్ 0 సినిమాకు పెట్టిన బడ్జెట్ ఒక హీరోకు రెమ్యునరేషన్ కింద ఇస్తే... వామ్మో అంత రెమ్యునరేషనా అని షాక్ అవుతున్నారు కదా.  అవును.. రెమ్యునరేషనే.  ఎవరో హాలీవుడ్ నటుడు అనుకునేరు.  హాలీవుడ్ కాదు.  సల్మాన్ ఖాన్  రెమ్యునరేషన్ అది.  


బాలీవుడ్ లో బిగ్ బాస్ 13 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది.  దీనికోసం బాలీవుడ్ లో ఈ బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఆయనను తప్పా మరెవ్వరిని బిగ్ బాస్ హోస్ట్ గా ఊహించుకోవడం లేదు.  అందుకే ఆయనకు డిమాండ్ పెరిగింది.  


బిగ్ బాస్ 13 వ సీజన్ కోసం సల్మాన్ కు ఏకంగా 400 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.  ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఏంటి అని షాక్ అవ్వకండి.  సల్మాన్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా అంత రెమ్యునరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.  అది సంగతి. 


మరింత సమాచారం తెలుసుకోండి: