అల్లు అరవింద్ పెద్దకొడుకు అల్లు బాబి నీలు షాను ఈమధ్య పెళ్ళి చేసుకున్న వార్తలకు సంబంధించిన ఫోటోలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళి ఫోటోలలో ఎక్కడా అల్లు అర్జున్ కనిపించక పోవడంతో బన్నీ ఏమైపోయాడు అంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. 

ఈ అనవసరమైన రచ్చ అల్లు బాబి దృష్టి వరకు వెళ్ళినట్లు ఉంది. దీనితో బాబి రంగంలోకి దిగి ఈ నెగిటివ్ వార్తల పై క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్ళి ఫోటోలు అన్నీ దగ్గర ఉండి తీసిన వ్యక్తి తన తమ్ముడు బన్నీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

అంతేకాదు నెగిటివ్ వార్తల పై మరింత అసహనాన్ని వ్యక్త పరుస్తూ తన మ్యారేజ్ రిసెప్షన్ వీడియోను తను త్వరలో అందరికీ షేర్ చేయబోతున్నాని అందులో హడావిడి చేసిన బన్నీని చూస్తే అందరి సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి అంటూ కామెంట్స్ చేసాడు. సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాల పై జనంకు విపరీతమైన ఆసక్తి పెరిగి పోవడంతో ప్రతి విషయానికి సాక్షాలు పెట్టుకోవలసిన పరిస్థితి ఎలా ఏర్పడిందో బాబి అసహనం బట్టి అర్ధం అవుతుంది.

ఇది ఇలా ఉంటే అల్లు బాబి పెళ్ళి చేసుకున్న నీలు షా పార్ట్ టైమ్ యోగా టీచర్ గా పనిచేస్తూ ఒక మల్టీ నేషనల్ అడ్వటైజింగ్ ఏజన్సీ క్రియేటివ్ టీమ్ లో పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రానున్న రోజులలో అల్లు ఫ్యామిలీ హీరోల సినిమాల అడ్వటైజింగ్ విషయాలలో ఈమె సలహాలు కూడ కీలకంగా మారే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: