రాజకీయనాయకులు ఎన్నికలలో ఎదుటి పార్టీని తిట్టిపోస్తూ తీర అనుకోకుండా ఆపార్టీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి పార్టీలు మారిపోతు ప్రజల కోసమే ఇదిఅంతా చేస్తున్నాము అని అంటున్నారు. అయితే రాజకీయాలు అంటే తనకు పడవు అంటూ తరుచూ చెప్పే నాగార్జున ఇప్పుడు ‘బిగ్ బాస్’ విషయంలో అనుసరించిన తీరు రాజకీయ నాయకుల ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఇలాంటి కామెంట్స్ రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. గత ఏడాది విడుదలైన ‘దేవదాస్’ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ నాగార్జున ‘బిగ్ బాస్’ షోపై కొన్ని ఘాటైన విమర్శలు చేసాడు. ఆషో ప్రస్తావన తీసుకు వస్తు ఆషోను హోస్ట్ చేస్తున్న నాని గురించి తాను కామెంట్ చేయడం లేదనీ వాస్తవానికి ఆ షో కాన్సెప్ట్ తనకు నచ్చదు అంటూ ఓపెన్ గా కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఎదుటి వాళ్ళు ఎదో చేస్తుంటే చాటు నుండి చూడటం అన్న కాన్సెప్ట్ తో డిజైన్ చేయబడ్డ ‘బిగ్ బాస్’ షో కాన్సెప్ట్ తనకు నచ్చదు అని అంటూ అలా వ్యవహరించడం పద్ధతి కాదు అంటూ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో తొంగి చూసే హక్కు ఎవరికీ లేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఈ సందర్భంలో నాగార్జున ‘వాయిరిస్టిక్’ అనే పదం కూడా వాడాడు. ఈ పదానికి అర్ధం వెతికితే ఎదుటి వాళ్లు నగ్నంగా ఉంటే శృంగారంలో పాల్గొంటుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం అని ఆ పదానికి అర్థం వస్తుంది. 

మరి అలాంటి కామెంట్స్ చేసిన నాగార్జున ఇప్పుడు ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా మారడంతో గతంలో నాగార్జున చేసిన కామెంట్స్ ను కోట్ చేస్తూ కొందరు నాగ్ అన్న మాటలు అతడికి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ షోను హోస్ట్ చేయడం వల్ల నాగార్జునకు 10 కోట్లకు పైగా పారితోషికం వస్తుంది కాబట్టి ఆ పారితోషికం గురించి మోజుతో తాను గతంలో ‘బిగ్ బాస్’ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ మరిచిపోయాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కు నాగ్ సమాధానం ఏమిటో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: