ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన స్నేహితుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు పాత రోజులు గుర్తు చేశారు. ‘శివ’ సినిమాలోని పాట క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో పూరీ జూనియర్‌ ఆర్టిస్టుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

 

ఈ వీడియోలో నీలిరంగు చొక్కాలో ఉన్న జూనియర్‌ ఆర్టిస్టు ఈ రోజు సూపర్‌ దర్శకుడిగా రాణిస్తున్న పూరీ జగన్నాథ్‌. హే పూరీ.. ఎంత గొప్ప సినీ ప్రయాణం’ అని ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన పూరీ ప్రతిస్పందించారు. ‘అవును సర్‌..’ అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్‌ చేశారు.

 

నైపుణ్యం, ప్రతిభ ఉంటే ఎవరైనా సరే ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అనడానికి నువ్వు ఓ ఉదాహరణ, అందరికీ స్ఫూర్తిదాయకం’ అని వర్మ తిరిగి బదులిచ్చారు. వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇటీవల విడుదలైంది.

 

ప్రస్తుతం ఆయన తన తర్వాతి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పూరీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. జులై 18న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: