తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతుంది. కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టిసుంది. రిలీజ్ తర్వాత తొలి వారాంతంలో సుమారు రూ. 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది.ఇక తొలి వారాంతం తర్వాత సినీ పరిశ్రమకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున కబీర్ సింగ్ తట్టుకొని భారీ కలెక్షన్లు సాధించింది.

 

రిలీజ్ తర్వాత తొలి సోమవారం నాడు కబీర్ సింగ్ చిత్రం రూ.12 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.82.83 కోట్లు నమోదు చేసింది. షాహీద్ కపూర్ కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సందీప్ పై బాలీవుడ్ లో  ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

సీనియర్ నటుడు డీనో మారియో ఈ కబీర్ సింగ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అద్భుతమైన సినిమా, షాహీద్ పెర్ఫార్మెన్స్‌ ఆహో అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.  చూసిన ప్రతీ ఒక్కరు షాహిద్ నటనకి ఫిదా అయ్యారు. షాహిద్ తన్ ఇంటెన్స్ ఫెర్ ఫామెన్స్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళాడు.  కబీర్ సింగ్‌ను తొలి ఆట నుంచే నెగిటివ్ రివ్యూలు వెంటాడాయి.

 

సినీ విమర్శకుల ప్రతికూల స్పందనను ఎదురించి వసూళ్ల పరంగా దూసుకుపోవడం గమనార్హం. ఈ చిత్రానికి మహారాష్ట్ర, చెన్నైలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడంపై షాహీద్ కపూర్ గమ్మత్తుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. షాహిద్, కియారా, సందీప్ రెడ్డి వంగ ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకో రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: