నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా ‘బంగార్రాజు’  తెరకెక్కబోతోంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ఇప్పటికే ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు సమాచారం.

 

ప్రస్తుతం నటీనటులు ఎంపికపై కసరత్తులు  జరుగుతున్నాయి. చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఓ పూర్తిస్థాయి పాత్రలో సందడి చేయబోతున్నారు. నాగచైతన్య సరసన కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేస్తున్నట్టు  సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోంది.

 

‘మహానటి’ తర్వాత కొన్నాళ్లు తమిళంలోనే బిజీగా గడిపిన కీర్తి ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఓ చిత్రంతో పాటు ‘మన్మథుడు 2’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘బంగార్రాజు’ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

 

నాగచైతన్య ఈమధ్య తనకు సరిపడే పక్క సాఫ్ట్ కధలే ఎంచుకుంటున్నాడు.  ఎందుకంటే మొదట ఓ రెండు మూడు మాస్ కధలను చేసిన చైతు, వాటితో మెప్పించ లేకపోయాడు. తదుపరి ప్యూర్ లవ్ కధలను మాత్రమే చేస్తున్నాడు. వాటితో వరుసగా హిట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. నాగార్జున మాదిరి క్లాస్ సబ్జక్ట్స్ డీల్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: