క‌న్ను కొడుతూ ఒకే ఒక్క చిన్న వీడియోతో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయిపోయింది మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ ప్రియావారియ‌ర్‌. ఆ వీడియో ఏకంగా జాతీయ స్థాయిలో ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యింది. ఆమె క‌న్నుకొట్టిన తీరుకు ఎన్నో భాష‌ల్లో ఎంతోమంది యువ‌త ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్‌తో ఆమెకు చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. హీరోయిన్‌గా ప్రియ చేసిన ఫ‌స్ట్ సినిమాయే అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.


ఫ‌స్ట్ సినిమాయే ప్లాప్ అవ్వ‌డంతో ప్రియా కెరీర్‌కు అక్క‌డితోనే చాలా వ‌ర‌కు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్ల‌య్యింది. ఇక ఇప్పుడు తెలుగులో నితిన్ సినిమాతో మంచి ఆఫ‌ర్ ప‌ట్టేసింది. ఎట్ట‌కేల‌కు నితిన్ ప్రియాకు ఛాన్స్ ఇవ్వ‌డంతో ఆమె తెలుగులో ఖాతా తెరిచింద‌ని.. ఇక‌పై ఆమెకు వ‌రుస పెట్టి ఛాన్సులు వ‌స్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు.


అయితే నితిన్ సినిమాలో ఆమె రోల్‌కు అంత సీన్ లేద‌ట‌. ఆమె స్క్రీన్ టైం 20 నిమిషాల‌కు మించి లేద‌ట‌. ఈ సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ మెయిన్ హీరోయిన్‌. క‌నీసం ప్రియ రెండో హీరోయిన్‌గా అయినా ఉంటుంద‌ని అనుకున్నారు. తీరా ఇప్పుడు ప్రియా వారియ‌ర్ పాత్ర సెకండ్ హీరోయిన్ కంటే చిన్న‌దే అని తేలింది. 


చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఆమె పాత్ర‌ను 20 నిమిషాల‌కే డిజైన్ చేసిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం తెలుగులో మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ‌ల హ‌వా న‌డుస్తోంది. ప్రియా ఒక్క సినిమాతో క్లిక్ అయినా మంచి ఛాన్సులే వ‌స్తాయి. అయితే రాక రాక వ‌చ్చిన ఛాన్సే చిన్న‌ది మ‌రి దీంతో ఆమె ఎలా త‌న‌కు తాను ఫ్రూవ్ చేసుకుంటుందో ?  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: