అ! సినిమాతో మంచి ఫేం తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.  విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కి హీరో "నాని" నిర్మాతగా వ్యవహరించారు. నాన్ లీనియర్ కథనంతో నడిచే ఈ సినిమా తెలుగు సినిమాలో ఒక న్యూ ఏజ్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తర్వాతి సినిమా "కల్కి" ఆంగ్రీ మాన్ " రాజశేఖర్ " తో చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది.

 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తనకు నందమూరి బాలకృష్ణ తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉందట.గతంలో మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణని ఒకే తెరపై చూపించేలా మల్టీస్టారర్ చేయాలనీ ఉందని చెప్పిన ప్రశాంత్ రీసెంట్ గా కుదిరితే బాలకృష్ణతో సపరేట్ గా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని అన్నాడు. అందుకు కొన్ని క్రేజీ ఆలోచనలు కూడా ఉన్నట్లు చెప్పాడు.

 

బాలకృష్ణ గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య అదే ఫార్మాట్ లో సినిమాలు చేయాల్సి వస్తోంది. ఆయనతో సెట్టయితే కొన్ని స్పెషల్ కథలు రెడీ చేస్తానని వివరణ ఇచ్చాడు. మరి ఈ దర్శకుడి ఆలోచనలు బాలకృష్ణకు ఎంతవరకు నచ్చుతాయో చూడాలి. ఇక ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో చేస్తున్న చిత్ర్ం "కల్కి" కథ నాదేనంటూ ఒక రచయిత క్లెయిమ్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

కల్కి సినిమా ట్రైలర్ మొన్నే విడుదలయింది. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలోని హార్న్ ఓకె ప్లీజ్ అనే ఐటెం సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ పాటలో రాజశేఖర్ తో బ్రిటీష్ భామ స్టెప్పులు వేయనుంది. ఈ నెల 28 న ఈ సినిమా విడుదల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: