దక్షిణాదిలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నా... ఇక్కడ హీరోలంతా నార్త్ ఇండియన్ అమ్మాయిలతో నటించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నార్త్ ఇండియన్ హీరోయిన్లతో పోలిస్తే సౌత్ లో హీరోయిన్లు చాలా తక్కువ మాత్రమే చార్జి చేస్తుంటారు. అయితే మన వాళ్లకు మాత్రం ఇక్క‌డ‌ అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరోయిన్లు న‌చ్చ‌రు.


వీరిని కాదని పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టు నార్త్ బామ‌లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారంతా ఇక్కడ రెండు మూడు హిట్లు రాగానే కళ్ళు నెత్తికెక్కేసి బాలీవుడ్‌లో పాగా వేయాలని అత్యాశకు పోతుంటారు. ఇలా వెళ్ళిన చాలా మంది హీరోయిన్లు బొక్కబోర్లా పడ్డారు. ఇలియానా, శృతిహాసన్, తమన్నా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి బాటలోనే పయనిస్తోంది పూజా హెగ్డే.


ప్రస్తుతం ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ పూజని తమ సినిమాల్లో హీరోయిన్‌గా కావాలని పట్టుబట్టి మరి తీసుకుంటున్నారు. ఆమెకు వ‌రుస‌గా ఆఫర్లు ఉన్నాయి. ఇంత స్టార్ స్టేటస్ కాదని ఆమె ఇప్పుడు బాలీవుడ్ అవకాశాల కోసం అర్రులు చాస్తోంది. పూజ హిందీలో ఒక మల్టీ ఫుల్ సినిమా ఒప్పుకుని తెలుగులో రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయింది.


తెలుగులో ప్రస్తుతం రష్మిక మందన్న, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూజ తెలుగులో అవకాశాలు వదులుకుంటే ఆమెకు కూడా ఇంతకు ముందు హీరోయిన్ల‌కు ప‌ట్టిన గతే పడుతుందని... ఆమె సర్దుకుని ఇంటికి వెళ్లి పోవాల్సిందే అన్న విమర్శలు తెలుగు సినిమా వర్గాల్లో వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: