అతిచౌక ధరకు నేప్కిన్‌ తయారుచేసిన కోవైకి చెందిన అరుణాచలం మురుగానందం పేరు 12వ తరగతి పాఠ్యపుస్తకంలో చేరింది. రుతుస్రావంపై సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మురుగానందం నకు మంచి గుర్తింపే లభించింది. ఒక ఆలోచన, కృషి, సహనం.. వెరసి ప్యాడ్‌మ్యాన్‌.

 

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సినిమా ప్రముఖులు విపరీతంగా రేటింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మురుగానందం పేరును 12వ తరగతి జీవశాస్తం పాఠ్యపుస్తకంలో ‘తెలుసుకోవాల్సిన వ్యక్తులు’ పాఠంలో చేర్చింది.

 

పాఠశాలల పునఃప్రారంభం రోజే కొత్త పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. తనకు దక్కిన గౌరవంపై మురుగానందం స్పందిస్తూ... ‘‘తమిళనాడు విద్యార్థులు, పాఠశాలలో చదువుతున్న నా సొంత బిడ్డలు ఏదో ఒకరోజు నా గురించి చదువుతారని అనుకున్నాను.ఈ రోజు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.

 

నేను స్కూల్లో ఉన్నప్పుడు థామస్‌ అల్వా ఎడిసన్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, మార్కోనిలను గొప్ప ఆవిష్కర్తలుగా చదువుకున్నాను.  ఒక పేద కుటుంబానికి చెందిన, పెద్దగా చదువుకోని ఒక సాధారణ యువకుడు సాధించిన విజయమిది. పాఠ్యాంశాల్లో ఒక తమిళ వ్యక్తి గురించి చదువుకోవడం భావితరాలకు స్ఫూర్తిదాయకం కాగలదు’’ అని మురుగానందం సంతోషం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: