చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో ఆగష్టు నుండి ప్రారంభం కాబోతున్న మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయింది. ఈసినిమాలో చిరంజీవి పక్కన నటించబోయే హీరోయిన్ వేటలో ఉన్న కొరటాలకు ఈమధ్య ఒక ఆలోచన రావడంతో కొరటాల తన ఆలోచనను చిరంజీవితో పంచుకున్నట్లు టాక్. 

ఈమూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. రైతుల సమస్యల చుట్టూ తిరిగే ఈమూవీ కథలో చిరంజీవి వయసు మళ్ళిన ఒక రైతు పాత్రలో కూడ కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమూవీలో చిరంజీవి నటించే యంగ్ పాత్రకు హీరోయిన్ వెతుకుతున్న కొరటాల ఇదే మూవీలో చిరంజీవి నటించే ముసలి రైతు పాత్రకు జంటగా విజయశాంతికి పాత్రను క్రియేట్ చేస్తే ఈమూవీకి మరింత క్రేజ్ వస్తుందనీ కొరటాల చిరంజీవికి ఇచ్చిన సలహా అని టాక్. 

అయితే గతంలో చిరంజీవి మెగా స్టార్ గా కొనసాగే రోజులలో చిరంజీవికి విజయశాంతికి మధ్య అనేక భేదాభిప్రాయాలు రావడమే కాకుండా ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు పలకరించు కోవడం కూడ మానివేశారు అన్న వార్తలు వచ్చాయి. ఆతరువాత వీరిద్దరు రాజకీయాల బాట పట్టడంతో ఎవరి పార్టీల విజయం కోసం వారు రాజకీయాలలో చాల బిజీగా కాలం గడిపారు.

ఇప్పుడు విజయశాంతి కూడ చిరంజీవిలాగే సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న పరిస్థుతులలో ఆమె మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తోంది. దీనితో ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేసి విజయశాంతిని చిరంజీవి లేటెస్ట్ మూవీకి కీలక పాత్రలో నటింప చేయాలి అన్న కొరటాల సూచనకు చిరంజీవి నుండి ఇంకా ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. ఒకవేళ కొరటాల సూచనకు చిరంజీవి ఒప్పుకుంటే విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ అత్యంత అద్భుతంగా ప్రారంభం అవుతోంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: