రాజమౌళి సినిమాలో నటించే హీరోలు కనీసం తమ రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని రాజమౌళికి తాకట్టు పెట్టడమే కాకుండా జక్కన్న పెట్టె కఠిన పరీక్షలు తట్టుకునే మానసిక పరిస్థితి కలిగి ఉండాలి. దీనికితోడు రాజమౌళి సినిమాలలో నటించే హీరోలకు వారి పాత్రలకు సంబంధించి చాల శారీరక శ్రమ చేయవలసిన పరిస్థితి కూడ ఉంటుంది. 

‘బాహుబలి’ షూటింగ్ సమయంలో ప్రభాస్ వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ పడిపోయి వెన్ను పూసకు గాయాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో జూనియర్ కు రాజమౌళి కొన్ని గుర్రాలను మచ్చిక చేసుకోమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈమూవీలో నటిస్తున్న జూనియర్ పాత్రకు గుర్రాలను మచ్చిక చేసుకుంటూ వాటితో బ్రిటీష్ వారిపై గొరిల్లా పోరాటాలు చేసే షెడ్ ఉంటుంది. స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో జరిగే ఈమూవీ కథ చారిత్రాత్మక ఆధారాలు లేకపోయినా ‘కొమరం భీమ్’ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రల షేడ్స్ తో జూనియర్ చరణ్ ల పాత్రలు ఉంటాయని స్వయంగా రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. 

త్వరలో ఈమూవీకి సంబంధించిన మరొక కీలక షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఆ షెడ్యూల్ లో జూనియర్ అనేక గుర్రాలకు శిక్షణ ఇస్తూ వాటిమధ్య ఉండే కొన్ని సీన్స్ ను చిత్రీకరించబోతున్న నేపధ్యంలో కొందరు నిపుణులైన హార్స్ రైడర్స్ చేత జూనియర్ కు గుర్రాలను ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయమై శిక్షణ ఇప్పిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ శిక్షణ జరుగుతున్న ఒక రహస్య ప్రదేశం నుండి కొందరు ఆఫోటోలను తమ సెల్ కెమెరాలతో తీసి మీడియాకు లీక్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు జూనియర్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: