సూపర్ సినిమాతో సూపర్బ్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి వరసగా సినిమాలు చేసి టాలీవుడ్ లో సెట్ అయ్యింది.  అరుంధతి సినిమాతో అనుష్క కెరీర్ మారిపోయింది.  అనుష్క అంటే అరుంధతి అనే విధంగా ఉంటుంది సినిమా.  ఈ సినిమా తరువాత అలాంటి పాత్రలు వరసగా చేసింది.  


రాజమౌళితో మూడు సినిమాలు చేసింది.  విక్రమార్కుడు సినిమాలో గ్లామరస్ రోల్ చేసిన అనుష్క, బాహుబలి సీరీస్ లో అదరగొట్టింది.  ఈ మూవీ తరువాత ఆమెకు  అనేక ఆఫర్లు వచ్చాయి.  కానీ ఎందుకో ఆమె వాటిని పక్కన పెట్టింది.  సైరా మూవీ లో ఓ క్యామియో రోల్ చేసింది.  


ప్రస్తుతం సైలెన్స్ అనే మూవీ చేస్తోంది.  కొత్త దర్శకుడు హేమంత్ దర్శకత్వం వహిస్తున్నారు.  పెద్ద దర్శకులతో చేసిన ఈ స్టార్ నటి ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా చేయడం ఏంటి.. ఆమెకు తగిన పాత్రలు రావడం లేదా.. లేదంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకె ఆమె ఇష్టపడుతుందా.. 


క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్లో సినిమా తెరకెక్కుతోంది.  ప్రస్తుతం ఈ మూవీ అమెరికాలో షూట్ చేస్తున్నారు. అన్ని సినిమాలు చేయగలను అని నిరూపించుకోవడం కోసమే అనుష్క ఇలాంటి పాత్రలను ఎంచుకుంటుందా లేదంటే.. కథ నచ్చడంతో మూవీ చేస్తోందా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: