కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఏఎల్‌.విజ‌య్ తెలుగు వాళ్ల‌కు కూడా ప‌రిచ‌య‌మే. తమిళంలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఏఎల్ విజయ్ ఒకరు.  మదరాసిపట్టనం (తెలుగులో 1947 ల‌వ్‌స్టోరీ),  దైవ తిరుమగళ్ ( తెలుగులో నాన్న ) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు. ఇక అభినేత్రి, అభినేత్రి 2 లాంటి సినిమాల‌ను కూడా విజ‌య్ డైరెక్ట్ చేశాడు. రీసెంట్‌గా వ‌చ్చిన అభినేత్రి 2 అంచ‌నాలు అందుకోలేక‌పోయింది.


ఇక విజ‌య్ అమ‌లాపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల‌కే వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో విడాకులు తీసేసుకున్నారు. త‌ర్వాత ఎవ‌రి జీవితాలు వాళ్ల‌వి. అమ‌ల మ‌ళ్లీ సినిమాల్లో బీజి అయ్యింది. మ‌ళ్లీ డైరెక్ష‌న్‌లో  బిజీ అయిన విజ‌య్ ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విష‌యాన్ని విజ‌య్ స్వ‌యంగా ప్రెస్‌నోట్ ద్వారా వెల్ల‌డించాడు. 


త‌మిళ‌నాడులోని మన్నివక్కమ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ విజ‌య్ జీవితంలోకి రెండో భార్య‌గా రాబోతుంది. ఈ జులైలోనే తమ మ్యారేజ్ జరుగుతుందని.. మీ అందరి ప్రేమతో.. ఆశీస్సులతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని తెలిపాడు. విజ‌య్ రెండో జీవితం అయినా సాఫీగా సాగాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: