అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో నటిస్తూనే ఈ ఏడాది చివర్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీ కోసం ఆలోచనలు మొదలు పెట్టేసాడు. అల్లు అర్జున్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి దరిదాపు 16 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటి వరకు అతడు మధ్య వయష్కుడి పాత్రలో నటించి ఆ గెటప్ లో ఎప్పుడు కనిపించలేదు.

అయితే వేణు శ్రీరామ్ మూవీలో అల్లు అర్జున్ రెండు షేడ్స్ లో ఉండే పాత్రలలో కనిపించబోతున్నట్లు టాక్. ఆ రెండు పాత్రలలో ఒక మధ్య వయష్కుడి పాత్ర కూడ ఉంటుందని తెలుస్తోంది. దీనితో ఆ మిడిల్ ఏజ్ గెటప్ కోసం బన్నీ ఎలాంటి లుక్ లో కనిపించాలి ఎలాంటి విగ్ పెట్టుకోవాలి అన్న విషయమై ఇప్పుడు కొందరు స్టైలిస్ట్ లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

దీనికోసం ముంబాయ్ నుండి కొంతమంది హెయిర్ స్టైలిస్ట్ లు ఇప్పటికే హైదరాబాద్ వచ్చి బన్నీ మిడిల్ ఏజ్ లుక్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక మోటార్ బైక్ చుట్టూ నడిచే ఈ విభిన్నమైన స్టోరీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి త్రివిక్రమ్ మూవీ తరువాత అల్లు అర్జున్ సుకుమార్ మూవీని మొదలు పెడతాడు అని భావిస్తే ఆ విషయాలను పక్కకు పెట్టి ఇప్పుడు వేణు శ్రీరామ్ కు అల్లు అర్జున్ ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి అసలు సుకుమార్ సినిమా ఉంటుందా ఉండదా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా బన్నీ మిడిల్ ఏజ్ లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: