అల్లు అర్జున్ మూడు సినిమాలు సంతకాలు చేసినప్పటికీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడదలయ్యే అవకాశం కనిపించట్లేదు. " నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా కాగానే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ అది సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో సినిమా లాంచింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'ఐకాన్' కనబడుట లేదు అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

 

ఈ సినిమాలో బన్నీ యంగ్ ఏజ్డ్ లోనే కాకుండా మిడిల్ ఏజ్డ్  గెటప్పులోను కనిపిస్తాడట. ఈ రెండేకాదు ఇంకా ఒకటి రెండు గెటప్పులతోను సందడి చేస్తాడని చెబుతున్నారు. ఇలా డిఫరెంట్ గెటప్స్ తో .. కాస్ట్యూమ్స్ తో బన్నీ కనిపిస్తాడని అంటున్నారు. ఈ కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం కారణంగానే సుకుమార్ ప్రాజెక్టుకంటే ముందుగా  ఈ ప్రాజెక్టు చేయడానికి బన్నీ  ఒప్పుకున్నాడట.        

 

ఇక సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలా టైం పడుతుంది. సుకుమార్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అటువంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కావడానికి ఇంకా టైం పడుతుంది. చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి అయి సుకుమార్ తో సినిమా రావాలంటే వచ్చే సంవత్సరం చివరి వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: