అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు జాయిన్ కావడానికి చాల ఆలస్యం అయ్యే పరిస్థుతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న హిందీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు మధ్యలో ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ తో అమెరికా ప్రయాణ నేపధ్యంలో అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ కు ఆగష్టు నెలాఖరు వరకు వచ్చే ఆస్కారం కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థుతులలో అందుబాటులో ఉన్న చరణ్ జూనియర్ లతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను కొనసాగిస్తూ సమయం వృథా కాకుండా రాజమౌళి ఈమూవీ షూటింగ్ ను కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ జూనియర్ లపై ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించే యాక్షన్ ప్లాన్ లో ప్రస్తుతం రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి అత్యంత కీలకమైన ఈ ఇంట్రడక్షన్ సాంగ్ లో చరణ్ జూనియర్ లతో పాటు సుమారు రెండువందలమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ కోసం రెండు భారీ సెట్లను రాజమౌళి క్రియేట్ చేయించినట్లు టాక్. 

ఈపాట చిత్రీకరణ కోసం 3 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈపాటలో చరణ్ జూనియర్ ల పాత్రల స్వభావం ఈమూవీని చూసేవారికి అర్ధం అయ్యే రీతిలో ప్రత్యేకంగా ఈపాటను రాజమౌళి వ్రాయించినట్లు తెలుస్తోంది. కీరవాణి అత్యంత శ్రద్ధతో ఈపాటకు ఇచ్చిన ట్యూన్ ఈమూవీకి హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. ఈ పాట చిత్రీకరణ పూర్తి అయ్యే సరికి అలియా భట్ అందుబాటులో లేకపోయినా ఈమూవీలో నటించే మరో సెకండ్ హీరోయిన్ పాత్ర ఎంపిక పూర్తి చేసి చరణ్ జూనియర్ లతో పాటు ఆ సెకండ్ హీరోయిన్ పై కూడ కొన్ని కీలక సన్నివేశాలు తీసి టైమ్ గ్యాప్ ను కవర్ చేయాలని రాజమౌళి తన చేతిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: