తెలుగు సినిమాలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో సైతం ఈ బయోపిక్ లు చాలా వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువ భాగం రాజకీయ నాయకుల గురించి వచ్చినవే. ఒక సాధారణ  మధ్య తరగతి వ్యక్తి జీవితం మీద తెలుగులో ఇంత వరకు బయోపిక్  రాలేదు. అటువంటి సాహసం ఇంతవరకు చేయలేదు. బాలీవుడ్ లో "ప్యాడ్ మాన్" లాంటి సినిమా వచ్చింది. కానీ తెలుగులో ఇలాంటి కథ వస్తుందని "మల్లేశం" వచ్చే వరకు తెలీదు.

 

చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత "చింతకింది మల్లేశం" జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మల్లేశం". ఆసు యంత్రాని కనిపెట్టి తన తల్లి బాధలు తీర్చిన వ్యక్తి కథ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాకి టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇందులో మల్లేశం పాత్రని  పెళ్ళి చూపులు ఫేమ్ ప్రియదర్శి నటించారు.

 

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు చిత్రబృందాన్ని కలిసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ,‘మల్లేశం’ సినిమా చూశాను. ఒక ప్రయోజనం ఉన్న చిత్రమిది. చేనేత కార్మికురాలిగా తల్లి పడుతున్న ఆవేదనను చూసి పెద్దగా చదువుకోకపోయినా ఆసు యంత్రాన్ని కనుగొని, ఆ కార్మికుల కష్టాలను కొంత మేర తగ్గించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం అభినందనీయుడు.

 

ఆ కృషిలో భాగంగా నా వంతు సాయంగా నాలుగు ఆసు యంత్రాలు కొనుగోలు చేయడానికి లక్ష రూపాయాలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజ్‌కు అభినందనలు. మంచి ప్రయత్నం చేసిన మల్లేశం బృందానికి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: