గత మూడు రోజుల నుండి సైరా నరసింహా రెడ్డి సినిమా వివాదం గురించి సోషల్ మీడియా, వెబ్ మీడియాలలో వార్తలు వస్తున్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా నిర్మాత చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉయ్యాలవాడ వంశీకులు, ఆ ప్రాంత రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం ఎందుకు చెల్లించట్లేదు అనే ప్రశ్నకు ఇందులో రామ్ చరణ్ తప్పేం లేదనే సమాధానం వినిపిస్తుంది. 
 
ఉయ్యాలవాడ వంశానికి చెందిన వారికి, రైతులకు కుదుర్చుకున్న ఒప్పందం లక్షల్లోనే ఉన్నప్పటికీ వారు ప్రస్తుతం ఆ నష్ట పరిహారాన్ని కోట్లలో ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. 6 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరినట్లు, కానీ నిర్మాత రామ్ చరణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి అక్టోబర్ 2 న సైరా సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి వివాదాలు సినిమాపై నెగటివిటీని పెంచుతాయి. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్షల్లో నష్ట పరిహారానికి ఒప్పుకుని ఇప్పుడు కోట్లు డిమాండ్ చేయడం వెనుక కారణం ఏంటో తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ఈ విషయంపై స్పందిస్తే ఈ వివాదం గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరి సైరా టీమ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: