అక్టోబర్ 2న చిరంజీవి ‘సైరా’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఆమూవీ సునామీకి భయపడి మరి ఏ సినిమా పోటీగా విడుదలచేసే ఆలోచనలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితులలో వెంకటేష్ నాగచైతన్యల ‘వెంకీ మామ’ నిర్మాతలు ఇస్తున్న లీకులు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. 

‘జై లవకుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‌ గా రూపొందుతున్న ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం చాల వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఈమూవీ యూనిట్ 25 రోజుల పాటు కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుని ఇప్పుడు నెక్స్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో తీస్తున్నారు.

ఈ షెడ్యూల్‌ తో దాదాపు 75 శాతం వరకు సినిమా పూర్తి అవుతున్న నేపధ్యంలో ఈసినిమా రిలీజ్ కు సంబంధించి ఈమూవీ నిర్మాత సురేశ్ బాబుకు ఒక ఊహించని ఆలోచన వచ్చినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాను అక్టోబర్ 4న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

అక్టోబర్ 4న విడుదల అంటే సరిగ్గా చిరంజీవి ‘సైరా’ సినిమా విడుదలైన రెండు రోజుల గ్యాప్ ఇది ఒక రకమైన సాహసమే అని చెప్పుకోవాలి. అయితే రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కాబట్టి దానికితోడు దసరా సెలవులు కాబట్టి తమకు ఎటువంటి నష్టం ఉండదు అని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. దీనికితోడు సురేశ్ బాబు చేతిలో కావలసినన్ని ధియేటర్లు ఉంటాయి కాబట్టి ‘సైరా’ మ్యానియా తమను ఏమి చేయలేదు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 200 కోట్ల భారీ సినిమా ‘సైరా’ తో 50 కోట్ల లోపు ‘వెంకీ మామ’ పోటీగా విడుదల కాగలిగితే అది సంచలనమే..   



మరింత సమాచారం తెలుసుకోండి: