బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేయడానికి నాగార్జున రెడీ అయిపోయినా ఈ షోను ప్రారంభించే డేట్స్ అనౌన్స్ చేయడానికి రెండు కీలక సమస్యలు అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ఈషోలో పాల్గొనే హౌస్ మేట్స్ విషయంలో ఇప్పటికీ కొంత క్లారిటీ ఈ షో నిర్వాహకులు మిస్ అవుతున్నట్లు టాక్. 

ఈ సీజన్ 3కి పేరున్న సెలెబ్రెటీలను తీసుకు రావడం ఈషో నిర్వాహకులకు ఇప్పటికీ తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. దీనికి కారణం 100 రోజులు కొనసాగే పరిస్థితులు. పేరున్న సెలెబ్రెటీలు ఏకంగా 100 రోజులు తమ కుటుంబాన్ని అదేవిధంగా తమ కెరియర్ ను పూర్తిగా వదులుకుని ‘బిగ్ బాస్’ హౌస్ కు అంకితం కావడానికి ఇప్పటికీ ఏమాత్రం ఇష్ట పడటం లేదనీ సమాచారం. 

పైగా 100 రోజుల పాటు ఫోన్ కు దూరంగా ఉండడం అన్నది కూడా తమకు సాధ్యం అయ్యే పనికాదు అని చెపుతున్నట్లు టాక్. దీనితో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు లోపాయికారీగా రోజుకు ఒకసారి ఫోన్ లు చేసుకునే అవకాశం ఇస్తామని తద్వారా తమ ఇంటి వ్యవహారాలూ తెలుసుకోవచ్చు అని చెపుతున్నా చాలామంది పేరున్న సెలెబ్రెటీలు పారితోషికం ఎంత ఇస్తామన్నా ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు అని తెలుస్తోంది. 

దీనితో ఎక్కడా అవకాశాలు లేని చిన్న చిన్న నటులు యాంకర్లు మినహా పేరున్న వారు ఎవరు ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్ కు రాలేము అని చెపుతున్న పరిస్థుతులలో నాగార్జున లాంటి పెద్ద హీరోను పెట్టుకున్నా ‘బిగ్ బాస్ 3’ షోకు రేటింగ్స్ రావేమో అన్న భయంలో ఈషో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ విజేతగా మారాలి అంటే సోషల్ మీడియాలో టీమ్ లు మేనేజ్ చేయవలసిన నేపధ్యంలో ఇలాంటి ఆర్మీలను ఏర్పరుచుకుంటూ అనవసరపు తల నొప్పులు మాకెందుకు అంటూ కొందరు సెలెబ్రెటీలు అడుగుతున్న ప్రశ్నలకు ‘బిగ్ బాస్’ షో టీమ్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: