తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లామర్ కు పెట్టింది పేరు. గ్లామర్ లేకుండా తెలుగు సినిమాను ఊహించడం కష్టం. కొత్త హీరోయిన్లు పరిచమయ్యేది తెలుగు ఇండస్ట్రీలోనే. అంత గ్లామర్ ఇస్తుంది తెలుగు సినిమా. అందానికి అభినయం తోడైతే వీరి పాపులారిటీకి ఆకాశమే హద్దు. పదేళ్లకు పైగా కెరీర్ ను కొనసాగిస్తున్న పరువాలు తగ్గని హీరోయిన్లు కొద్దిమంది ఉన్నారు.  వారెవరో చూద్దాం..


శ్రియ: 2001లో ఇష్టం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నువ్వు-నేను, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గతేడాది పెళ్లి చేసుకున్నా అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ 105 వ సినిమాలో శ్రియనే హీరోయిన్. ఈ ఢిల్లీ భామ కెరీర్ వయసు 18 ఏళ్లు.


త్రిష: 2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా వచ్చిన త్రిష 2004లో ప్రభాస్ తో నటించిన వర్షంతో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అద్భుతమైన అందం, యాక్టింగ్ తో తెలుగు – తమిళ సినిమాలను ఏలేసింది. ఒక దశలో ఆమె కాల్షీట్లే దొరికేవి కావు. ఇప్పటికీ ఫిట్ గా ఉండడంతో తమిళ్ లో ఈమెకు సినిమాలు ఉన్నాయి. ఈ చెన్నై బ్యూటీ కెరీర్ 16 ఏళ్లు.


నయనతార: 2003లో మలయాళం సినిమాలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాతో ఫేమస్ అయ్యింది. అటుపై టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోలందరితో సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. మెగాస్టార్ తో చేసిన సైరా, 152 వ సినిమాలోనూ ఈమే హీరోయిన్ అని సమాచారం. ఈ మళయాళ కుట్టీ కెరీర్ వయసు 16 ఏళ్లు.


అనుష్క: 2005 లో సూపర్ సినిమాతో సూపర్బ్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తక్కువకాలంలోనే టాప్ పొజిషన్ లో కూర్చుంది. 2009లో చేసిన అరుంధతి ఓ సెన్షేషన్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు విజయశాంతి తరువాత అనుష్కే అనేశారు. ఇప్పటికీ ఆమెకు సినిమాలున్నాయి. మెగాస్టార్ సైరాలో ఆమె ప్రముఖ పాత్ర చేస్తోంది. ఈ బెంగళూర్ బ్యూటీ కెరీర్ వయసు 14 ఏళ్లు.


తమన్నా: 2006లో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా 2007లో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో బ్రేక్ తెచ్చుకుంది.   అటుపై అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికీ ఈమె కెరీర్ డల్ కాలేదు. మెగాస్టార్ తో చేసిన సైరా లో చేసింది. మిల్కీ బ్యూటీగా ఇప్పటికీ అభిమానులను గిలిగింతలు పెడుతోంది. ఈ ముంబై బ్యూటీ కెరీర్ వయసు 13 ఏళ్లు.


కాజల్: 2007 లో లక్ష్మి కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన కాజూ 2009లో రామ్ చరణ్ మగధీరలో నటించి స్టార్ హీరోయిన్ అయింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూడని కాజూ ఇప్పటికీ హాట్ బ్యూటీగా, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. పెద్ద హీరోలకు ఆప్షన్ గా మారింది. ఈ టాలెంటెడ్ ముంబై బ్యూటీ కెరీర్ వయసు 12 ఏళ్లు.

 


 వీరంతా తమ అందం, నటన, క్రమశిక్షణతో ఇంత లాంగ్ కెరీర్ సాధించారు. టాలెంట్ ఉంటే ఎవరూ అడ్డుకోలరనడానికి ఈ భామలే నిదర్శనం. ఈరోజుల్లో హీరోయిన్లకు లాంగ్ కెరీర్ చాల కష్టమైన విషయం. గత తరం హీరోయిన్లలా ఇండస్ట్రీని ఏలడం కష్టం. ఇప్పుడొస్తున్న హీరోయిన్లు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడెళ్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అందంతో పాటు నటన, క్రమశిక్షణ కూడా తోడైతే కొత్తగా వచ్చేవారికి కూడా లాంగ్ కెరీర్ సాధ్యమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: